
ఆయువు తీసిన ఆట వస్తువు
మీర్‌పేట: ఓపెన్‌జిమ్ పరికరం తలపై పడటంతో ఓ చిన్నారి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన మీర్‌పేటలో చోటు చేసు కుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జిల్లెలగూడలోని దాసరి నారాయణ కాలనీకి చెందిన ప్రసాద్ కుమారుడు నిఖిల్ (5) గురువారం సాయంత్రం స్థానికంగా ఉండే పిల్లలతో కలిసి రోజూ మాదిరిగానే ఆడుకునేందుకు పక్కనే ఉన్న చిల్డ్రన్స్ పార్కుకు వెళ్లాడు. ఓపెన్ జిమ్‌లోకి వెళ్లి ఎయిర్ స్వింగ్ పరికరంపైకి ఎక్కాడు. దీనికి సంబంధించిన ఇనుపకడ్డీ తలపై పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యంతోనే..
ఓపెన్ జిమ్‌లోని ఎయిర్ స్వింగ్ పరికరం పాడైపోయి నెలలు గడుస్తున్నా మరమ్మతులు చేయించలేదు. పాడైన పరికరం పక్కన పడేసి ఉండగా, గుర్తు తెలి యని వ్యక్తులు దీన్ని యథా స్థితిలో పెట్టారు. ఇది తెలియని చిన్నారి ఎయిర్ స్వింగ్‌పైకి ఎక్కడంతో ఇనుప బొంగు నిఖిల్ తలపై పడింది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని వాకర్స్, స్థానిక కాలనీలవాసులు మండిపడ్డారు.
ఓపెన్ జిమ్‌లోని ఎయిర్‌స్వింగ్ పరికరం పడి చిన్నారి మృతి
మీర్‌పేట్‌లోని చిల్డ్రన్స్ పార్కులో ఘటన

ఆయువు తీసిన ఆట వస్తువు