
అందాల భామలకు బందోబస్తు
హైదరాబాద్‌లో నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన అందాలతారలు సోమవారం నాగర్జునసాగర్ వెళ్లారు. నగరం నుంచి మూడు టూరిస్టు బస్సుల్లో బయలుదేరిన వీరికి రహదారి పొడవునా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నానికి చెందిన సీపీఎం నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు, మహేశ్వరం డీసీపీసునీతారెడ్డి బందోబస్తును పర్యవేక్షించారు. అడుగడుగునా పోలీసు పహారా నడుమ అందాల తారలు సాగర్‌కు తరలివెళ్లారు. – ఇబ్రహీంపట్నం

అందాల భామలకు బందోబస్తు