పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రాన్ని పరిశీలించిన అబ్జర్వర్‌ | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రాన్ని పరిశీలించిన అబ్జర్వర్‌

Published Tue, May 7 2024 6:40 PM

పోస్ట

హుడాకాంప్లెక్స్‌: జనరల్‌ అబ్జర్వర్‌ డా.ప్రియాంక శుక్ల సోమవారం సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన మాక్‌ పోల్‌, ఈవీఎంల కమిషనింగ్‌, సింబల్‌ లోడింగ్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ తీరును, స్ట్రాంగ్‌ రూమ్‌ను పరిశీలించారు. ఎల్‌బీనగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌కి సంబంధించి క్రిటికల్‌ పోలింగ్‌ స్టేషన్‌లను సందర్శించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి ఎస్‌.పంకజ, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

సీఎంను కలిసిన లారీ అసోసియేషన్‌ సభ్యులు

కొందుర్గు: లారీ ఓనర్స్‌ అసో సియేషన్‌ సభ్యులు సోమ వారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా లారీ ఓనర్ల ప్రధాన సమస్యలు తీర్చేందుకు కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో చేర్చినట్లు ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్‌ సాధిక్‌ తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే ఇచ్చారు.

ఎన్నికల కోడ్‌కు సహకరించాలి

సీఐ శంకర్‌కుమార్‌

యాచారం: ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ప్రజలు సహకరించాలని యాచారం సీఐ శంకర్‌కుమార్‌ కోరారు. యాచారం మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం సాగర్‌ రోడ్డుపై రాకపోకలు సాగించే వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారమే డబ్బులు తీసుకెళ్లాలని సూచించారు. మద్యం తరలింపుపై సైతం నిఘా పెట్టినట్లు తెలిపారు. తనిఖీల్లో పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

బెల్టు షాపులపై దాడులు

షాద్‌నగర్‌రూరల్‌: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఎకై ్సజ్‌ అధికారులు బెల్టు షాపులపై దాడులు నిర్వహించారు. అక్రమంగా మద్యం అమ్ముతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని వెలిజర్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు ఎకై ్సజ్‌ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని వెలిజర్ల, హజిపల్లి, షాద్‌నగర్‌ పట్టణంలో ఎకై ్సజ్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో బెల్టుషాపులపై దాడులు చేపట్టారు. వెలిజర్ల గ్రామంలో రాఘవేందర్‌ నిర్వహిస్తున్న షాపులో 11.34 లీటర్ల (63 లిక్కరు బాటిళ్లు) మద్యాన్ని స్వాధీనం చేసుకొని షాపు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. మద్యం విలువ సుమారు రూ.12 వేలు ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా మద్యం అమ్మినా, నిల్వ చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మద్యం స్వాధీనం

ఇబ్రహీంపట్నం రూరల్‌: ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని ఆదిబట్ల పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద సోమవారం మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపారు. రావిర్యాలకు చెందిన టి.శ్రీకాంత్‌ వద్ద 41 మద్యం బాటిళ్లను సీజ్‌ చేసినట్లు తెలిపారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రాన్ని పరిశీలించిన అబ్జర్వర్‌
1/2

పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రాన్ని పరిశీలించిన అబ్జర్వర్‌

పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రాన్ని పరిశీలించిన అబ్జర్వర్‌
2/2

పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రాన్ని పరిశీలించిన అబ్జర్వర్‌

 
Advertisement
 
Advertisement