
సమావేశంలో మాట్లాడుతున్న మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం రూరల్: ఎన్నికల్లో ఒటమి చెందామని కార్యకర్తలు అధైర్య పడొద్దని.. అండగా ఉంటానని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం ఆదివారం ఆదిబట్ల మున్సిపల్ పరిధి బొంగ్లూర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు కొప్పు జంగయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంచిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఎంతో కష్టపడి పని చేసిన కార్యకర్తలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. దశాబ్ద కాలంగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. కానీ ఎన్నికల ఫలితాలు ఆశించినట్లుగా రాలేదన్నారు. గెలుపు, ఓటములు సహజమేనని, ఓడిపోయామని ఎవరూ బాధపడొద్దని సూచించారు. ప్రజల కోసం ప్రజల పక్షాన నిరంతరం నిలబడదామని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో తిరిగి బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. త్వరలో స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయని క్యాడర్ సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ సత్తయ్య, యాచారం జెడ్పీటీసీ జంగమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి