
మృతదేహం
షాద్‌నగర్‌రూరల్: గుర్తు తెలియని వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో ఆదివారం చోటుచేసుకుంది. రైల్వే ఎస్‌ఐ సయ్యద్‌అక్బర్ ప్రకారం.. గుర్తు తెలియని వృద్ధుడు(65) రైల్వే స్టేషన్‌లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జికి తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయాన్ని తెలుసుకున్న స్టేషన్‌మాస్టర్ ఉదయ్‌కుమార్ రైల్వే ఎస్‌ఐ సయ్యద్‌అక్బర్‌కు సమాచారం అందించారు. ఎస్‌ఐ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి శరీరంపై తెల్ల చొక్కా, తెల్ల ధోతి, నలుపు రంగు నిక్కర్ ధరించి ఉన్నాడు. మృతుడి వివరాలు తెలిసినా.. ఆచూకీ లభించినా వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. స్టేషన్ మాస్టర్ ఉదయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు రైల్వే ఎస్‌ఐ సయ్యద్‌అక్బర్ తెలిపారు.