
ఎమ్మెల్యే ను సన్మానిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు, స్వాములు
నందిగామ: సమాజంలోని ప్రతి ఒక్కరు దైవచింతన అలవర్చుకోవాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మండల పరిధిలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో నందిగామకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జిలెల్ల రాంరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. దైవచింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పారు. అంతకు ముందు అంతిరెడ్డిగూడలోని హనుమాన్, ఎల్లమ్మ ఆలయాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు జంగ నర్సింహయాదవ్, ఎంపీటీసీ సభ్యులు కొమ్ము కృష్ణ, దేపల్లి కుమార్‌గౌడ్, చంద్రపాల్‌రెడ్డి, నాయకులు బాల్‌రెడ్డి, సుదర్శన్ గౌడ్, వేణుగోపాల్ గౌడ్, సత్తయ్య, ప్రభాకర్, నిరంజన్‌గౌడ్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
అభినందనల వెల్లువ
కొత్తూరు: నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికై న వీర్లపల్లి శంకర్ ఆదివారం కొత్తూరు మున్సిపాలిటీతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నాయకులు ఆయన్ను శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో మద్దతు ప్రకటించి తన గెలుపునకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలు, నాయకుల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు హరినాథ్‌రెడ్డి, నాయకులు సుదర్శనన్‌గౌడ్, వేణుగోపాల్‌గౌడ్, శ్రీశైలంగౌడ్, నర్సింహ, రమేశ్, సత్తయ్య, ప్రభాకర్, సురేశ్‌గౌడ్, కొమ్ముకృష్ణ, చంద్రపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్