
మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
ఇబ్రహీంపట్నం: కేంద్రంలో బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో కలిసి పనిచేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్ర మంగళవారం రాత్రి ఇబ్రహీంపట్నం చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో జరిగిన సభలో తమ్మినేని మాట్లాడుతూ.. బీజేపీ సాగిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్య పరిచేందుకు దేశవ్యాప్తంగా యాత్రలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజల హక్కులను కాలరాస్తూ రాజ్యాంగ విరుద్ధంగా దేశంలో బీజేపీ పాలన కొనసాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ చెప్పినట్లుగా పాలన సాగుతోందన్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సీ ఎం కేసీఆర్‌తో కలిసి పనిచేస్తామని తమ్మినేని తెలి పారు. వామపక్షాలు, బీఆర్‌ఎస్ పార్టీలు రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తే, పొత్తులో భాగంగా ఇబ్రహీంపట్నం నుంచి సీపీఎం బరిలో ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, జాన్‌వెస్లీ, జంగారెడ్డి, యాదయ్య, సామేల్, జగదీశ్, రాజు, కవిత పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంలో పోటీ చేస్తాం
మంచాల: వచ్చే ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మండలంలోని ఆరుట్ల, మంచాల, జాపాల, రంగాపూర్, చీదేడ్, దాద్‌పల్లి గ్రామాల్లో మంగళవారం జన చైతన్య యాత్ర కొనసాగింది. ఆరుట్లలో నిర్వహించిన సభలో తమ్మినేని మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్, నియోజకవర్గ ఇన్‌చార్జి పగుడాల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
కలిసొచ్చే పార్టీలతో దేశవ్యాప్త పోరు
రాహుల్‌పై అనర్హత వేటు దుర్మార్గపు చర్య
రాష్ట్రంలో పొత్తు పొడిస్తే ఇబ్రహీంపట్నం బరిలో ఉంటాం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం