
గిరిజనుల అభివృద్ధికి గ్రామ్ ఉత్కర్ష అభియాన్
వీర్నపల్లి(సిరిసిల్ల): గిరిజనుల అభివృద్ధికి గ్రామ్ ఉత్కర్ష అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఎంపీడీవో వాజిద్ పేర్కొన్నారు. మండలంలోని సీతారాంనాయక్‌తండాలో గురువారం అవగాహన కల్పించారు. ఆధార్‌కార్డు, వికలాంగుల పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ల కోసం అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం అక్కడకు వచ్చిన గిరిజనులకు రక్తపరీక్షలను నిర్వహించి మందులు పంపిణీ చేశారు. తహసీల్దార్ ముక్తార్‌పాషా, వ్యవసాయాధికారి కొత్తపల్లి జయ, ఎంఈవో శ్రీనివాస్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంట్ లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు.