
రైతువేదికలకు డబ్బులు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: రైతు భరోసా నిధులు విడుదల సందర్భంగా రైతు వేదికల వద్ద సంబరాల కోసం ఎట్టకేలకు నిధులు విడుదలయ్యా యి. వాస్తవానికి రైతు భరోసా ప్రారంభం, ము గింపు సందర్భంగా రైతు వేదికల వద్ద సీఎంతో ముఖాముఖి కార్యక్రమాలను ప్రభుత్వం ఏర్పా టు చేసింది. ఇందుకోసం ప్రతీ రైతు వేదికకు 200 మంది రైతులను తరలించాలని ఏఈవో (అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్)లకు టార్గెట్లు విధించింది. ఇటీవల జరిగిన కార్యక్రమానికి రై తులను తరలించడం, వారికి టీ, స్నాక్స్ ఖర్చుల ను భరించడం వంటి పనులు ఏఈవోలే చూసుకున్నారు. తాజాగా ముగింపు వేడుకులకు సైతం ఏఈవోలు నిర్వహించాలని చెప్పడంతో వారంతా తలలు పట్టుకున్నారు. గత వేడుక డబ్బులే రాకపోగా, మరోసారి చేతి నుంచి డబ్బులు ఎలా పెట్టుకోవాలో తెలియక సతమతమయ్యారు. ఈ విషయాన్ని మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘అన్నదాతా.. రైతువేదికకు రా వా? ’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం స్పందించింది. మంగళవారం మధ్యాహ్నం అన్ని రైతు వేది కల వద్ద సంబరాలు నిర్వహించేందుకు ఏఈ వోలకు కావాల్సిన నిధులు విడుదల చేసింది.
● విడుదల చేసిన వ్యవసాయ శాఖ

రైతువేదికలకు డబ్బులు