
ఆరోగ్య‘యోగం’
సిరిసిల్లటౌన్: ప్రపంచానికి భారత్ అందించిన ఆరోగ్య కానుకగా యోగాను డీఎంహెచ్‌వో రజిత అభివర్ణించారు. అంతర్జాతీయ యోగా డే వేడుకలను సిరిసిల్లలో శనివారం నిర్వహించారు. పద్మనాయక కల్యాణ మండపంలో సామూహిక యోగా కార్యక్రమం ఆయుష్, పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. సామూహిక యోగాసనాలు అలరించాయి. జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ రామకృష్ణ, డాక్టర్ నవీన్, జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ శశిప్రభ, నోడల్ అధికారులు డాక్టర్ సౌమిని, డాక్టర్ శ్వేత, డాక్టర్ సాయిదీప్తి, డీపీఎం తిరుపతి, జిల్లా క్రీడల యువజనశాఖ అధికారి అజ్మీర్ రాందాసు, పతంజలి యోగా సమితి సీనియర్ సలహాదారులు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, భారత్ స్వాభిమాన్ ట్రస్టు అధ్యక్షుడు గుడ్ల రవి, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చేపలు బుచ్చయ్య, పతంజలి సమితి అధ్యక్షుడు బిల్లా శ్రీకాంత్. యోగా క్రీడాకారులు పెరుమాండ్ల దేవయ్య, యోగాసన స్పోర్ట్స్ సహాయ కార్యదర్శి చిటికెన శ్రీనివాస్, ఒడ్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జిల్లా ఆయుష్ యునానీ డిస్పెన్సరీ యోగా శిక్షకులు బొల్లాజీ శ్రీనివాస్, టి.స్వప్న నిర్వహించారు. కొత్తచెరువు పార్కులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యోగా డే నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, యోగా గురువు పల్లికొండ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక గీతానగర్ హైస్కూల్‌లో నిర్వహించిన వేడుకల్లో హెచ్‌ఎం శారద, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఆరోగ్య‘యోగం’

ఆరోగ్య‘యోగం’

ఆరోగ్య‘యోగం’

ఆరోగ్య‘యోగం’