
వర్షాలు కురవాలని..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): వరుణుడు కరుణించి వర్షాలు కురిపించాలని కోరుతూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రైతులు శుక్రవారం శివాలయంలో శివలింగంను జలదిగ్బంధం చేశారు. అనంతరం కర్రకు కప్పను కట్టి కప్పతల్లి ఆట ఆడారు. ఇంటింటికీ తిరుగగా మహిళలు కప్పతల్లిపై నీళ్లు పోసి వర్షాలు కురువాలని వేడుకున్నారు. రెడ్డి సంక్షేమ సంఘాల అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, రెడ్డి సంఘం మండలాధ్యక్షుడు గుండాడి వెంకట్‌రెడ్డి, సద్ది లక్ష్మారెడ్డి, చందుపట్ల లక్ష్మారెడ్డి, రాగుల ఎల్లారెడ్డి, పారిపల్లి సంజీవరెడ్డి, బందారపు మల్లారెడ్డి, రాంరెడ్డి, రాజిరెడ్డి, ముత్యంరెడ్డి, నంది కిషన్, బాపురెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.