రెవె‘న్యూ’ బాగోతం ! | - | Sakshi
Sakshi News home page

రెవె‘న్యూ’ బాగోతం !

Jun 21 2025 2:57 AM | Updated on Jun 21 2025 2:57 AM

రెవె‘న్యూ’ బాగోతం !

రెవె‘న్యూ’ బాగోతం !

● ఇందిరమ్మ ఇసుక పక్కదారి ● అధికారుల కినుక.. ఆందోళనలో లబ్ధిదారులు ● వెల్లువెత్తిన విమర్శలు

సిరిసిల్లటౌన్‌: అక్రమ ఇసుక రవాణా కఠినతరం చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను సిరిసిల్ల రెవెన్యూ అధికారులు బేఖాతర్‌ చేస్తున్నారనటానికి ఇదో నిదర్శనం. కేవలం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికే కేటాయించాల్సిన ఇసుకను ప్రైవేటు నిర్మాణాలకు కేటాయించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రైవేటు వ్యక్తులకు ఇసుకను అందించడం సిరిసిల్లలో శుక్రవారం దుమారం రేపింది. ఇందిరమ్మ లబ్ధిదారులకు అడ్డగోలు నిబంధనలు పెట్టే అధికారులు తమకు అనుకూలమైన వారికి ఇసుకను అందజేయడంపై స్థానికులు విమర్శలు గుప్పించారు.

అసలేం జరిగింది?

పట్టణంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు శుక్రవారం స్థానిక రీచ్‌ నుంచి ఇసుక తీసుకునేందుకు రెవెన్యూ అధికారులు పర్మిషన్‌ ఇచ్చారు. మున్సిపల్‌ అధికారులు సుమారు 30 మందికి శుక్రవారం ఇసుక తీసుకునేందుకు రెవెన్యూ అధికారులకు సిఫారసు లేఖలు అందించినట్లు సమాచారం. లబ్ధి దారులతోపాటు రెవెన్యూ అధికారులు నిబంధలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల పేర్లనూ జాబితాలో చేర్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈవిషయమై శుక్రవారం పలువురు రెవెన్యూ సిబ్బందితో వాగ్వాదానికి దిగడం వైరల్‌ అయ్యింది.

కలెక్టర్‌ పేరుతో అధికారుల బుకాయింపు !

మున్సిపల్‌ నుంచి సిఫారసు లేఖలు తెచ్చుకున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకే శుక్రవారం రెవెన్యూ అధికారులు ఇసుకకు అనుమతించాల్సి ఉండగా ప్రైవేటు వ్యక్తులకు ఎలా అందించారని స్థానికులు వాపోయారు. ఈవిషయమై రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తే కలెక్టర్‌ ఆదేశాలున్నాయని బుకాయిస్తున్నారన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఒక్కొక్కరికి కేవలం రెండు, మూడు ట్రిప్పుల ఇసుక మాత్రమే అవసరం ఉంటుందని ఇందుకు ఒక్కో ట్రిప్పుకు ట్రాక్టర్‌ యజమానులు రూ.2వేలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అయితే రెవెన్యూ అధికారులు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై అధిక సంఖ్యలో ఇసుక ట్రిప్పులను కేటాయించినట్లు ఆరోపించారు. అధికారుల అండతో ఇసుకను కొందరు ఒక్కో ట్రిప్పునకు రూ.3,500 వరకు వసూలు చేసినట్లు సమాచారం. అధిక సంఖ్యలో ఇసుక ట్రిప్పులను సిరిసిల్ల బైపాస్‌రోడ్డుకు తరలించారని ఆ ప్రాంతంలో ప్రైవేటు నిర్మాణాలే తప్ప ఇంది రమ్మ ఇండ్ల నిర్మాణాలు లేవని పేర్కొన్నారు.

మా సిబ్బందిని మందలించాం

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు శుక్రవారం ఇసుక పర్మిట్లు ఇచ్చే క్రమంలో మా సిబ్బంది ఓవర్‌లుక్‌లో వెళ్లారు. ఈవిషయమై వారిని మందలించాం. ప్రైవేటు నిర్మాణాలకు ఇసుక ట్రిప్పుల కేటాయింపుపై విచారణ చేపడుతున్నాం. ఇకపై అలా జరగకుండా చర్యలు తీసుకుంటాం.

– మహేశ్‌కుమార్‌, సిరిసిల్ల తహసీల్దార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement