
రాజన్న కోడెలను కంటికి రెప్పలా చూసుకోవాలి
● జిల్లా పశువైద్యాధికారి రవీందర్‌రెడ్డి ● గోశాలలకు ఎంపికై న సిబ్బందికి అవగాహన సదస్సు
సిరిసిల్ల: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన రెండు గోశాలలోని కోడెలను కొత్తగా ఎంపికై న సిబ్బంది కోడెలను కంటికి రెప్పలా చూసుకోవాలని, నిత్యం పర్యవేక్షిస్తూ సంరక్షించాలని, జిల్లా పశువైద్యాధికారి రవీందర్‌రెడ్డి కోరారు. వేములవాడలోని ఆలయానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాల, ఆలయానికి సమీపంలోని కట్టకింద గోశాలలో పనిచేసేందుకు ఎంపికై న వారికి గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా పశువైద్యాధికారి రవీందర్ రెడ్డి, జిల్లా ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్ శిక్షణ ఇచ్చారు. ప్రతి రోజు జీవాలకు పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దాణా మూడు సార్లు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచాలని సూచించారు. జీవాల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ గోశాలలోని పశువైద్యాధికారి దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ప్రతి ఒక్క సిబ్బంది బాధ్యతగా తమ విధులు నిర్వర్తించి జీవాలను సంరక్షించాలని స్పష్టం చేశారు. ఎంపికై న సిబ్బంది అడిగిన పలు ప్రశ్నలకు పశువైద్యాధికారులు సమాధానాలు ఇచ్చారు.