
మత్తుపదార్థాల నియంత్రణలో యువత కీలకం
● ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్లక్రైం: జిల్లాలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణలో యువత కీలకంగా వ్యవహరించాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాల, కళాశాలల్లో విద్యార్థులకు మాదకద్రవ్యాలతో కలిగే అనర్ధాలపై వారంపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ద్వారా జిల్లా వ్యాప్తంగా పాఠశాల, కళాశాలల్లో అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. 20న జిల్లా, మండల కమిటీ సమావేశం, 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం, 22న డ్రగ్ హాట్‌స్పాట్‌లలో అవగాహన కార్యక్రమం, 23న మొక్కలు నాటడం, 24న స్లోగన్ రైటింగ్ కాంపిటీషన్, 25న పెయింటింగ్ కాంపిటీషన్, 26న అంతర్జాతీయ మాదక ద్రవ్య సేవన వ్యతిరేక దినోత్సవం, ర్యాలీ, ప్రతిజ్ఞ, సమావేశం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.