
సమావేశంలో మాట్లాడుతున్న డీఈవో
● జిల్లా విద్యాధికారి రమేశ్
సిరిసిల్ల ఎడ్యుకేషన్: జిల్లా విద్యా సమాచారాన్ని ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా పొందుపర్చాలని జిల్లా విద్యాధికారి రమేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గీతానగర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి విద్యా సంవత్సరం లాగే ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల, ఉపాధ్యాయ, పాఠశాల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చేందుకు అధికారులకు ఆదేశాలు చేశామన్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యూడైస్ ప్లస్‌పై పలు సూచనలు చేశారు. అనంతరం పాఠశాలలోని వసతులను పరిశీలించారు. ఎస్‌ఎస్‌ఏ సెక్టోరల్ ఆఫీసర్ పద్మజ, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.