
వేములవాడరూరల్: వేములవాడ మండలంలోని పలు గ్రామాల్లో ట్రాన్స్‌ఫార్మర్‌లు, స్తంభాల పరిస్థితిపై ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో మంగళవారం కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం లింగంపల్లికి కొత్త స్తంభాలను తెప్పించారు. వేములవాడ రూరల్ మండలంలోని 17 గ్రామాల్లో ప్రమాదకరంగా ఉన్న స్తంభాలను తొలగించి, కొత్తవి ఏర్పాటు చేస్తామన్నారు. అవసరం ఉన్నచోట ట్రాన్స్‌ఫార్మర్లు బిగించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పలు పల్లెల్లో స్థానికులు సహకరించకపోవడంతో ఆలస్యం జరుగుతోందన్నారు. ఈ విషయంలో అన్ని గ్రామాల ప్రజలు సెస్ అధికారులకు సహకరించాలని కోరారు.
