
హ్యాపీ బర్త్‌డే రత్నం మేడమ్
కుటుంబ సభ్యులతో బత్తుల రత్నం
● ఘనంగా శతాధిక వృద్ధురాలి
జన్మదిన వేడుక
ఒంగోలు సిటీ: ఒంగోలు నగరంలో శతాధిక వృద్ధురాలి జన్మదిన వేడుకను బుధవారం కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని మామిడిపాలేనికి చెందిన రిటైర్డ్ టీచర్ బత్తుల రత్నం 103 ఏళ్లు పూర్తి చేసుకొని 104వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వేడుక నిర్వహించారు. 1977లో ఉపాధ్యాయ వృత్తి నుంచి రిటైరైన రత్నం 48 ఏళ్ల నుంచి పెన్షన్ పొందుతుండటం విశేషం.