
ఆరుగురు జూదరుల అరెస్టు
మద్దిపాడు: మండలంలోని ఏడుగుండ్లపాడు, ఇనమనమెళ్లూరు గ్రామాల మధ్య కోడిపందేలు నిర్వహిస్తున్న వారిని ఆదివారం మద్దిపాడు పోలీసులు, యాంటీ గూండా స్క్వాడ్ సిబ్బంది పట్టుకున్నారు. పక్కాగా అందిన సమాచారంతో కోడిపందేల శిబిరంపై దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.11,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. శిబిరం వద్ద ఉన్న 11 మోటార్ సైకిళ్లు, 11 సెల్‌ఫోన్లు, రెండు కోళ్లను స్వాధీనం చేసుకుని మద్దిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టు చేసిన వారిని సోమవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్‌ఐ శివరామయ్య తెలిపారు.
కోడి పందేల శిబిరంపై దాడి
పామూరు: మండలంలోని వేర్వేరు గ్రామాల్లో కోడిపందేలు ఆడుతున్న, పేకాట ఆడుతున్న మొత్తం 22 మందిని ఆదివారం సాయంత్రం అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.30,380 నగదు, 8 కోళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై టి.కిషోర్‌బాబు తెలిపారు. మండలంలోని బుక్కాపురం సమీపంలోని పొలాల్లో కోడిపందాలు ఆడుతున్న 14 మందిని అరెస్ట్‌చేసి వారి వద్ద నుంచి 8 కోళ్లు, రూ.20,150 నగదు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా రావిగుంటపల్లె సమీపంలోని పొలాల్లో పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్ట్‌చేసి వారి వద్ద నుంచి రూ.10,680 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వారిపై కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిషోర్‌బాబు తెలిపారు.
22 మంది జూదరుల అరెస్టు
8 కోళ్లు, రూ.30,830 నగదు స్వాఽధీనం