
ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు
● జిల్లా వ్యాప్తంగా జేసీ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్
ఒంగోలు సబర్బన్: జిల్లా వ్యాప్తంగా జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ నేతృత్వంలో వివిధ విభాగాల అధికారులు శనివారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లాలోని అన్నీ ప్రభుత్వ శాఖలు కలిసికట్టుగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూ, పౌరసరఫరాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రోలజీ, ఫైర్ డిపార్ట్‌మెంట్, రూరల్ వాటర్ సప్లయ్, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా పెట్రోలు బంకులు, గ్యాస్ ఏజెన్సీలు, రేషన్ షాపులు, ఎంఎల్‌ఎస్ పాయింట్స్, రైస్ మిల్లులు, బాణసంచా గోడౌన్లు, వాటర్ ఆర్‌ఓ ప్లాంట్లు, హోటల్స్, బఫర్ గోడౌన్స్, సినిమా హాల్స్ తనిఖీ చేశారు. ఇప్పటి వరకు పెట్రోలు బంకులు 47, గ్యాస్ ఏజెన్సీలు–31, రేషన్ షాపులు–88, ఎంఎల్‌ఎస్ పాయింట్స్–10, రైస్ మిల్లులు–7, బాణసంచా గోడౌన్లు–5, వాటర్ ఆర్‌ఓ ప్లాంట్లు–26, ఆర్‌టీసీ బస్ స్టాండ్స్–5, సినిమా హాల్స్–9, హోటల్స్–2, బఫర్ గోడౌన్–1 తనిఖీ చేపట్టారు. మొత్తం 231 చోట్ల అధికారులు స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా తనిఖీలు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్‌తో పాటు మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వరలక్ష్మి, ఒంగోలు, కనిగిరి రెవెన్యూ డివిజనల్ అధికారులు కె.లక్ష్మీప్రసన్న, జి.కేశవర్ధన్‌రెడ్డి, సహాయ సరఫరా అధికారి ఐ.పుల్లయ్య, జిలాలోని అందరు తహసీల్దార్లు, సివిల్ సప్లయీస్, ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది ప్రత్యేక తనిఖీల్లో పాల్గొన్నారు.