
అండర్ 16 జిల్లా క్రికెట్ జట్టు ఇదే
ఒంగోలు: అండర్ 16 జిల్లా క్రికెట్ జట్టు జాబితాను జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 21న స్థానిక మంగమూరు డొంకలోని ఏసీఏ సబ్ సెంటర్ నెట్స్‌లో నిర్వహించిన ప్రాథమిక ఎంపికకు 80 మందికిపైగా క్రీడాకారులు హాజరయ్యారన్నారు. వారిలో 29 మందితో ప్రాబబుల్స్‌ను ఎంపిక చేశామని, వారికి బాపట్ల జిల్లా రావినూతల క్రికెట్ స్టేడియంలో ప్రాబబుల్స్ మ్యాచ్‌లు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారితో తుది జట్టును ఎంపిక చేశామన్నారు. ఎంపికై న క్రీడాజట్టు జూలై 3 నుంచి మంగళగిరి పేరేచర్లలో జరిగే అంతర్ జిల్లాల పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఎంపిక ప్రక్రియను అధ్యక్షుడు నవీన్‌కుమార్, సంయుక్త కార్యదర్శి బచ్చు శ్రీనివాసరావు, కోశాధికారి హనుమంతరావు, సభ్యులు బలరాం, కోచ్‌లు చంద్రశేఖర్, బాబూరావు పర్యవేక్షించారు.
జట్టు: పి.సుమిత్ సందేశ్ (కెప్టెన్), ఆర్.హేమంత్‌రాయల్ (ఉపాధ్యక్షుడు), సీహెచ్ భవిష్, ఎస్.అభినవ్, టి.శశాంక్, డి.మార్టిన్, కె.రామ్‌చరణ్, ఐ.కుషీశ్వర్ శర్మ, ఎం.పృధ్వీరాజ్, ఎం.దిండు గణేష్ రామ్, సీహెచ్ సుప్రీత్, ఎం.సిద్దార్థ, జి.అరవింద్, కె.వైభవ్, జె.దినేష్, డి.కెల్విన్, స్టాండ్ బైలుగా బి.వినయ్, జి.జస్వంత్, బి.నిశాంత్, వి.రిషిక్ చక్రవర్తి.