
రాష్ట్రానికి దక్కాల్సిన నిధులు, పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వ్యాఖ్యల పట్ల ఎంపీ విజయసాయిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర పథకాల క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం ఏపీ ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రానికి దక్కాల్సిన నిధులు, పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
‘హోదా ఇవ్వండి.. క్రెడిట్ అంతా మీకే ఇస్తాం’ అంటూ విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు. రైల్వే జోన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ఆపండి. పోలవరం ప్రాజెక్ట్, చెన్నై-వైజాగ్ కారిడార్ పూర్తి చేయండి. రైతు సంక్షేమానికి మద్దతు ఇవ్వండి’’ అంటూ విజయసాయిరెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు.
చదవండి: వదినమ్మా.. మొట్టికాయలు వేయాల్సింది బాబుకి!
Letting the new AP BJP chief Smt.@PurandeswariBJP know that the AP govt. is not interested in taking credit for central schemes. Please grant Special Category Status to AP, Railway Zone, dropping Disinvestment of Vizag Steel, complete the Polavaram Project, chennai-Vizag…
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 14, 2023