
అర్హులందరికీ రేషన్‌కార్డులు
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): గత ప్రభుత్వం ప దేళ్లపాలనతో ఒక్కరేషన్ కార్డు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ అందిస్తోందని పెద్దపల్లి ఎ మ్మెల్యే విజయరమణారావు అన్నారు. సర్సయ్యపల్లిలో మంగళవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, సీసీ రోడ్లు ప్రారంభించారు. ఇందిర మ్మ ఇళ్లకు ముగ్గు పోశారు. కాంగ్రెస్ నాయకుడు జూపల్లి తిరుమల్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గ అభి వృద్ధికి 18 గంటల పాటు పనిచేస్తున్నాని అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, ఏ ఎంసీ చైర్మన్ ప్రకాశ్‌రావు, సింగిల్‌విండో చైర్మన్ సందీప్‌రావు, తహసీల్దార్ బషీరొద్దీన్, ఎంపీడీవో దివ్య దర్శన్‌రావు, నాయకులు సతీశ్, రాములు, జానీ, రాజ్‌కుమార్, వెంకటరమణ పాల్గొన్నారు.