కోల్‌సిటీ(రామగుండం): నగరవాసులు కు క్కకాటు బారిన పడకుండా జాగ్రత్త పడాలని రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి సూచించారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం స్థానిక తిలక్‌నగర్ ప్రాంతంలో ఇంటింటా అవగాహన కల్పించారు. వీధికుక్కలు, పిచ్చికుక్కల బారిన పడకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలను పోస్టర్ల ద్వారా ప్రదర్శించారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నాగభూషణం, కుమారస్వామి, హెల్త్‌అసిస్టెంట్ సంపత్, మెప్మా సీవోలు ప్రియదర్శిని, శమంతకమణి తదితరులు పాల్గొన్నారు.
పోలీస్‌స్టేషన్ తనిఖీ
కమాన్‌పూర్(మంథ ని): పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ సోమవా రం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశా రు. రికార్డులను పరి శీలించారు. పాత కే సుల గురించి ఎస్సై ప్రసాద్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్ అవరణలో మొక్క లు నాటారు. గోదావరిఖని టూటౌన్ సీఐ ప్రసాదరావు తదదితరులు ఉన్నారు.
అన్నిరంగాల్లో రాణించాలి
రామగిరి(మంథని): మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని డీఎంహెచ్‌వో అన్న ప్రసన్నకుమారి సూచించారు. కల్వచర్ల గ్రామపంచాయతీ పరిధి మారుతీనగర్‌లో రేండ్ల శారద– కుమార్‌స్వామి దంపతులు ఆర్‌ఎస్‌కే ఆపన్నహస్తం ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆమె సోమవారం ప్రారంభించి మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు కుట్టు శిక్షణ ఎంతో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కుక్కలతో జాగ్రత్త