
ఆస్తిపన్ను చెల్లించండి
కోల్‌సిటీ(రామగుండం): అపరాధ రుసుం లేకుండా 2025–26 ఆర్థిక సంవత్సరానికి చెందిన ఆస్తిపన్ను చెల్లించడానికి ఈనెల 30వ తేదీ వరకు అవకాశం ఉందని రామగుండం నగరపాలక కమిషనర్(ఎఫ్‌ఏసీ) అరుణశ్రీ బుధవారం తెలిపారు. జూలై ఒకటినుంచి పన్నుమొత్తంపై నెలకు రెండుశాతం చొప్పున అపరాధ రుసుం విధిస్తామన్నారు. ఇళ్ల యజమానులు ఈనెలాఖరులోగా అపరాధ రుసుం లేకుండా ఆస్తిపన్ను చెల్లించి, ఈ అకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
అవి చీకటిరోజులు
● ఆదిలాబాద్ ఎంపీ జి.నగేశ్
పెద్దపల్లిరూరల్: ఇందిరాగాంధీ భారత ప్రధానిగా ఉన్నకాలంలో ఎమర్జెన్సీ విధించి సాగించిన చీకటి పాలనకు 50 ఏళ్లు నిండాయని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగి న సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమర్జెన్సీని అమల్లోకి తెచ్చిన 1975 జూన్ 25 దేశచరిత్రలో మరచిపోలేని చీకటిరోజన్నారు. కాంగ్రెస్ హయాంలో సాగిన ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు.. ము ఖ్యంగా యువతకు వివరించాలని పార్టీ నేతలకు సూచించారు. సమావేశంలో నాయకులు మోహన్‌రెడ్డి, కందుల సంధ్యారాణి, సత్యప్రకాశ్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, జంగ చక్రధర్‌రెడ్డి, జ్యోతిబసు, సదానందం, ఓదెలు, దిలీప్, మౌటం నర్సింగం, సదయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
డయేరియా నియంత్రణకు చర్యలు
పెద్దపల్లిరూరల్: సీజనల్ వ్యాధులను కట్టడి చేసే చర్యల్లో భాగంగా ‘డయేరియా కో రోక్తాం’ కార్యక్రమాన్ని జూలై 31వ తేదీవరకు నిర్వహిస్తున్నట్లు రాఘవాపూర్ పీహెచ్‌సీ వైద్యురాలు మమత అన్నా రు. బుధవారం ఆస్పత్రిలో ఈ కార్యక్రమంపై సిబ్బందికి ఆమె అవగాహన కల్పించారు.