పెద్దపల్లిరూరల్: సైబర్ నేరగాళ్ల వలలో పడి నష్టపోవద్దని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సైబర్‌క్రైం ఏసీపీ వెంకటరమణ అన్నారు. పెద్దపల్లిలోని ప్రభుత్వ ఐటీఐలో గురువారం విద్యార్థులకు సైబర్ నేరాలపై (క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయి న్స్, మల్టీలెవల్ మార్కెటింగ్ ఫ్రాడ్స్) ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి అవగాహన కల్పించారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టులు అంటూ బెది రించి సొమ్ము మాయం చేస్తున్నారని, పోలీసులు డిజిటల్ అరెస్టు చేయరనే విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. డిజిటల్ అరెస్టు కాల్స్ వస్తే స్పందించాల్సిన పద్ధతులపై వివరించారు. వెంటనే 1930 కు సమాచారం అందించాలన్నారు.
డ్రగ్స్‌పై అవగాహన
పెద్దపల్లిలోని వ్యాన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు గురువారం షీటీం బృందం సభ్యులు యాంటీ డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు. షీటీం ఇన్‌చార్జి ఎస్సై లావణ్య, సభ్యురాలు స్నేహలత మాట్లాడారు. ఆన్‌లైన్ మోసాలు, సైబర్‌క్రైం, మహిళలపై వేధింపులు తదితర అంశాలపై వివరించారు. టోల్‌ఫ్రీ 100, 1930తో పాటు 63039 23700 నంబర్‌కు సమాచారం అందించి సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. సభ్యులు మౌనిక, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
సైబర్‌క్రైం ఏసీపీ వెంకటరమణ