
సనత్ మృతదేహం వద్ద రోదిస్తున్న తండ్రి రమేశ్
నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మోగుతున్న మరణమృదంగం కలవరపెడుతోంది. విద్యార్థుల వరుస ఆత్మహత్యలు అలజడి రేపుతున్నాయి. కేవలం 36 రోజుల వ్యవధిలో ఇద్దరు వైద్య విద్యార్థులు ఉరేసుకుని చనిపోవడంతో విషాదం నెలకొంది. శుక్రవారం వేకువజామున మోసం సనత్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత ఫిబ్రవరి 25న ఇదే హాస్టల్‌లో దాసరి హర్ష అనే ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హర్ష మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడకు చెందినవాడు. వీరిద్దరూ ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక మరోవైపు 2022 మే 13న డాక్టర్ శ్వేత అనే మెడికల్ పీజీ విద్యార్థిని అనుమానాస్పదంగా గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలోని ప్రసూతి విభాగంలో విధినిర్వహణ సమయంలోనే అర్ధరాత్రి మృతిచెందడం గమనార్హం. శ్వేత కరీంనగర్‌కు చెందిన నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అత్యుత్తమ ప్రతిభతో పీజీ సీటు సాధించింది. ఇప్పటికీ శ్వేత మరణంపై ఒక స్పష్టత లేకపోవడం గమనార్హం. పీజీ మెడికల్ పూర్తయ్యే సమయంలో శ్వేత మరణించడం పలువురిని చలింపజేసింది.
వరుస ఘటనలు

రోదిస్తున్న తల్లి