
మాట్లాడుతున్న జీఎం
● నంబర్‌వన్‌గా నిలిచిన ఆర్జీ–1 ఏరియా ● జీఎం కె.నారాయణ వెల్లడి
గోదావరిఖని: 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఆర్జీ–1 ఏరియా 120శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు జీఎం కె.నారాయణ వెల్లడించారు. శుక్రవారం జీఎం కార్యాలయంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఉత్పత్తి లక్ష్యసాధనలో జీడీకే–5 ఓసీపీ అగ్రగామిగా నిలిచిందన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 39.05లక్షల టన్నుల లక్ష్యానికిగాను 47 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి సింగరేణిలోనే నెంబర్‌వన్‌గా ఆర్జీ–1 ఏరియా నిలిచిందన్నారు. ఏరియాలోని జీడీకే–11గని కంటిన్యూస్ మైనర్ యంత్రాలతో భారీగా ఉత్పత్తి సాధించామన్నారు. ఒక్క మార్చి నెలలో 175 శాతం ఉత్పత్తి సాధించి రికార్డు నెలకొల్పామన్నారు. ఇందుకు సహకరించిన ప్రతీఒక్కరికి అభినందనలు తెలిపారు. తాను జీఎంగా పనిచేసిన మూడేళ్లలో సహకరించిన ఉద్యోగులు, అధికారులు, కార్మిక సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి సంస్థ పురోగాభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.