
కండువాలు కప్పి ఆహ్వానిస్తున్న సత్తయ్య
గోదావరిఖని: సింగరేణి కాంట్రాక్టు కార్మికులు శుక్రవారం బీఎంఎస్‌లో చేరారు. వీరికి రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య కండువా కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంటాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని, కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల సంరక్షణకు నిరంతరం పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల హరిణ్, తాట్ల లక్ష్మయ్య, రాపోలు వజ్రవేణు, జనగామ రాయలింగు, గుండెబోయిన భూమయ్య, బానోతు రంజిత్‌కుమార్, దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.