సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండలం సుద్దాల గోదాం–1 నుంచి రెండు లారీల పౌరసరఫరాలకు సంబంధించిన పీడీఎస్ బియ్యం మాయమైన ఘటనలో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. గురువారం డేటా ఎంట్రీ ఆపరేటర్ శ్రీనివాస్‌రెడ్డి, లారీల డ్రైవర్ కం ఓనర్లు వెంకటేశం, ఆంజనేయులను జమ్మికుంటలో అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు.
ఓ రైస్‌మిల్లులో రెండు లారీల రేషన్ బియ్యం
ఈనెల రెండో వారంలో సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి, నారాయణపూర్ గ్రామాల మధ్య ఓ వ్యక్తి కొనుగోలు రేషన్ బియ్యాన్ని ఓ రైస్‌మిల్లులో నిల్వచేశారనే సమాచారంతో వచ్చిన అధికారి వాటిని పట్టుకోకుండా ముడుపులు తీసుకొని వదిలివెళ్లినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈనేపథ్యంలో ఆ బియ్యం శాంపిళ్లను తీసి విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుందని రైస్‌మిల్లర్లు చెప్పుతున్నారు. దీనిపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.
విచారణలో ఆసక్తికర అంశాలు..
మాయమైన లారీలతో పాటు బియ్యం మాయం చేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్ శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఆంజనేయులు, వెంకటేశంను అధికారులు వి చారించారు. అయితే శ్రీనివాస్‌రెడ్డి ఆ బియ్యాన్ని తీ సుకెళ్లి దింపమంటేనే దింపేందుకు వెళ్లామని తమ కు ఎలాంటి సంబంధం లేదని లారీ డ్రైవర్లు అధి కారుల ముందు చెప్పినట్లు తెలిసింది. శ్రీనివాస్‌రెడ్డిని విచారించగా తనకు ఎలాంటి సంబంధం లేద ని ఓ ఉన్నతాధికారి ఆదేశం మేరకు చేశానని చెప్పినట్లు అధికారుల్లో గుసగుసలు వినబడుతున్నాయి. అయితే ఆ ఉన్నతాధికారి లేకపోవడంతో గురువారం పూర్తిస్థాయి విచారణ కాలేదని సమాచారం.
రెండు రోజులు కరీంనగర్‌లోనే బస
ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రిని కలిసేందుకు రెండు రోజులుగా డేటా ఎంట్రీ ఆపరేటర్ కరీంనగర్‌లోనే బస చేసినట్లు ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. మంత్రితో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలను సైతం కలిసి తనను రక్షించాలని వేడుకున్నట్లు రైస్‌మిల్లర్స్ యాజమాన్యం చర్చించుకుంటున్నారు. వారు మాత్రం మాయమైన బియ్యంను వెంటనే అప్పగిస్తే తర్వాత చూద్దామని మాట దాట వేసినట్టు తెలిసింది.