
సుల్తానాబాద్‌లో వృద్ధాశ్రమం పనులను పరిశీలిస్తున్న కలెక్టర్
సుల్తానాబాద్: పట్టణంలో చేపడుతున్న వృద్ధాశ్రమాన్ని జూన్‌లోగా పూర్తి చేయాలని కలెక్టర్ సంగీత కాంట్రాక్టర్‌కు సూచించారు. సుల్తానాబాద్‌లో బుధవారం ఆమె పర్యటించారు. వృద్ధాశ్రమంతోపాటు స్వప్నకాలనీలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబి రాన్ని సందర్శించారు. ఆశ్రమంలో అదనపు టాయిలెట్స్, ప్రహరీ నిర్మించాలని అధికారులకు సూచించారు. కంటివెలుగు క్యాంపు వద్ద ఉన్న రీడింగ్ గ్లాస్ ల స్టాక్‌పై పర్యవేక్షణ ఉండాలని, ప్రిస్క్రిప్షన్ కళ్లద్దాలు వచ్చిన తరువాత ఆశాకార్యకర్తల ద్వారా లబ్ధి దారులకు పంపిణీ చేయాలని తెలిపారు. కంటివెలు గు ద్వారా ఇప్పటివరకు 2,22,442 మంది ప్రజలకు పరీక్షలు నిర్వహించామని, 36,023 మందికి రీడింగ్ కళ్లద్దాలు, 15,109 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపిణీ చేశామని తెలిపారు. డాక్టర్ శ్రీజ, తహసీల్దార్ యాకన్న, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్, హెచ్‌ఈఓ శ్రీనివాస్ రెడ్డి, ఏఎన్‌ఎంలు ఉన్నారు.
బస్తీ దవాఖానా పనుల పరిశీలన
పెద్దపల్లిరూరల్: జిల్లాకేంద్రం శివారు రంగంపల్లిలో ఏర్పాటు చేస్తున్న బస్తీ దవాఖానా ఆధునీకరణ పనులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీచేశారు. పాత పంచాయతీ భవనాన్ని రూ.13లక్షలతో ఆధునీకరించి బస్తీ దవాఖానా ఏర్పాటు చేసే పనులు పురోగతిలో ఉన్నాయి. అన్ని వసతులు కల్పించి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు అందుబాటులోకి తేవాలని పంచాయతీ రాజ్ డీఈఈ శంకరయ్యను ఆదేశించారు. ఏఈ రాజ్‌కుమార్, కౌన్సిలర్ చంద్రశేఖర్ తదితరులున్నారు.
ఆరోగ్య మహిళా కేంద్రాలను వినియోగించుకోండి
జిల్లాలో ప్రారంభించిన మూడు ఆరోగ్యమహిళ కేంద్రాలను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి మంగళవారం మహిళలకు వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రమోద్ కుమార్, డీఈ కే.దేవేందర్, ఏఈ సతీశ్, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ సంగీత