
మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్ పుట్ట మధు
మంథని: మన ఊరు–మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. మంథనిలోని జెడ్పీ బాలుర పాఠశాలలో వంటగదిని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. నాడు అధికారంలో ఉన్నవారు ఈ ప్రాంత విద్యార్థుల చదువుపై ఆలోచన చేయలేదన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాత్రం ఢిల్లీ యూనివర్సిటీలో చదుకున్నారని, ఇక్కడి పిల్లల కోసం ఇప్పటివరకు ఆలోచించడం లేదని పేర్కొన్నారు. ప్రజలను ఓటువేసే యంత్రాలుగానే గుర్తిస్తున్నారని విమర్శించారు. మంచి నాయకత్వాన్ని ఎన్నుకునే బాధ్యత ప్రజలపై ఉందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ప్రారంభించానని, విద్యార్థులకు వసతులు, మినరల్ వాటర్, రహదారి సౌకర్యం కల్పించానని గుర్తు చేశారు. 40 ఏళ్ల తర్వాత మంథనికి డిగ్రీ కళాశాల మంజూరైతే దూరప్రాంతంలో నిర్మించారని, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అనంతరం నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవం ఆకట్టుకుంది. మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, ఎంపీపీ కొండ శంకర్, జెడ్పీటీసీ తగరం సుమలత ఉన్నారు.
జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు