
మషాల్ మార్చ్‌లో మాట్లాడుతున్న మేయర్, చిత్రంలో అదనపు కలెక్టర్
కోల్‌సిటీ(రామగుండం): స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరానికి ఉత్తమ ర్యాంకు తేవడమే లక్ష్యమని మేయర్ బంగి అనిల్‌కుమార్ తెలిపారు. బుధవారం కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛమషాల్ మార్చ్ నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్‌దీపక్ పాల్గొన్నారు. గోదావరిఖని చౌరస్తా వరకు ఫ్లకార్డులతో మార్చ్ నిర్వహించారు. సాంస్కృతిక సారథి కళాకారులు స్వచ్ఛత, పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై పాటలు పాడి అవగాహన కల్పించారు. మేయర్ మాట్లాడుతూ నగరాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, ప్రజలు చెత్తను వేరు చేసి పారిశుధ్య కార్మికులకు అందించాలన్నారు. ఒకసారి ఉపయోగించిన ప్లాస్టిక్ వస్తువులను మరోసారి వాడొద్దని కుమార్ దీపక్ సూచించారు. కమిషనర్ సుమన్‌రావు మాట్లాడుతూ చెత్తను రోడ్లపై, కాలువల్లో పడేయొద్దని కోరారు. కార్పొరేటర్లు కల్వచర్ల కృష్ణవేణి, జనగామ కవితాసరోజినీ, దుబాసీ లలిత, అడ్డాల స్వరూప, బాలరాజ్ కుమార్, బొడ్డు రజిత, డెప్యూటీ కమిషనర్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
బల్దియాలో స్వచ్ఛ మషాల్ మార్చ్
మేయర్ బంగి అనిల్ కుమార్
పాల్గొన్న అదనపు కలెక్టర్ కుమార్‌దీపక్