
అవగాహన కల్పిస్తున్న అధికారులు
గోదావరిఖని: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మహిళా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయనను కలిసి వినతిపత్రం అందించారు. నిత్యం వందలాది మహిళలు తమ సమస్యలపై పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారని, వారికోసం ప్రత్యేక స్టేషన్ ఉంటే ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మేడిపల్లిలో కబరిస్తాన్ నిర్మాణానికి సింగరేణి భూమి కేటాయించేలా చూడాలన్నారు.
గెస్ట్‌హౌస్‌ను ఐటీపార్క్‌కు కేటాయించొద్దు
గోదావరిఖని: స్థానిక సింగరేణి బీగెస్ట్‌హౌస్‌ను ఐటీ పార్క్‌కు కేటాయించొద్దని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అర్జీ–1 డీఈఎం పర్సనల్ లక్ష్మీ నారాయణకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం సింగరేణి ఆస్తులను చేస్తున్నారన్నారని, ఇప్పటికే కంపెనీకి చెందిన క్వార్టర్లను, స్కూల్ బిల్డింగ్ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారన్నారు. ఇక్కడ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జాతీయ అప్రెంటిస్ షిప్‌పై అవగాహన
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ నైపుణ్యాభివృదద్ధి మంత్రిత్వశాఖ, రీజినల్ డైరెక్టర్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ప్రభుత్వ డైరెక్టర్ ఉపాధి కల్పనశాఖ సంయుక్తంగా బుధవారం జాతీయ అప్రెంటిస్ షిప్ అవగాహన సదస్సు నిర్వహించారు. అప్రెంటిస్‌షిప్ పొందాలనుకునే వారు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులను చేసుకోవాలని డిప్యూటీ డైరెక్టర్ మార్వల్‌దాస్, డిగ్గేవాడి కోరారు. ఉమ్మడి కరీంనగర్, మంచిర్యాల జిల్లాలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగసంస్థలు ప్రైవేట్ పారిశ్రామిక యజమాన్యాలు, ఐటీఐకి చెందిన విద్యార్థులు హాజరయ్యారు. ఏడీ విజయ్ కుమార్, శ్రీనివాస రెడ్డి, ఎస్‌వీకే నగేశ్, సీతారామలు, తిరుపతి రావు, ప్రిన్సిపాల్ నర్సింహాచారి తదితరులున్నారు.
అల్లూరు యూపీహెచ్‌సీ తనిఖీ
యైటింక్లయిన్‌కాలనీ: రామగుండం కార్పొరేషన్ అల్లూరులోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను బుధవారం కాయకల్ప బృందం సభ్యుడు శ్రీరాం, డిప్యూటీ డీఎంహెచ్‌వో కృపాబాయితో కలిసి తనిఖీ చేశారు. వైద్య సిబ్బందికి కాయకల్పపై అవగాహన కల్పించారు. నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్‌ను ఎలా నిలబెట్టుకోవాలనే విషయాన్ని వివరించారు. వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ అనిల్, అల్లూరు యూపీహెచ్‌సీ డాక్టర్ నీలిమ, హెల్త్ సూపర్వైజర్ సీతారామయ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

హోంమంత్రికి వినతిపత్రం ఇస్తున్న చందర్