
మాట్లాడుతున్న ప్రిన్సిపాల్ హిమబిందుసింగ్
కోల్‌సిటీ: రామగుండం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు రామగుండం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ హిమబిందు సింగ్ పేర్కొన్నారు. జీజీహెచ్ ఆస్పత్రిలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. త్వరలోనే సిటీస్కాన్‌తో పాటు 85 పడకల భవనాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్స్, స్టాండర్స్ ప్రకారం పేషెంట్ల వివరాలను కంప్యూటర్‌లో నమోదు చేసి ఓపీ కార్డులు ఇస్తున్నట్లు చెప్పారు. వెంటిలేటర్, న్యూరో సంబంధిత కేసులను మాత్రమే రెఫర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మైక్రోబయాలజీ, పథాలజీ, ఫోరెన్సిక్ తదితర ల్యాబ్‌ల నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. జిల్లాలోని ప్రజలు ఆస్పత్రిలో అందుతున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ దయాల్‌సింగ్, వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, ప్రొఫెసర్లు ఎ.శ్రీనివాస్, లక్ష్మీనర్సయ్య, అనూష, అశోక్, వేణుమాధవ్, రాజు, శివమణి, తదితరులు పాల్గొన్నారు.