
వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారిణి ప్రతిభ
నెల్లిమర్ల రూరల్/విజయనగరం: కజఖస్తాన్‌లో ఈ నెల 4 నుంచి జరుగుతున్న ఏషియన్ జూనియర్, యూత్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారిణి సత్తా చాటింది. విజయనగరం మండలంలోని కొండకరకాం గ్రామానికి చెందిన రెడ్డి భవాని శనివారం నిర్వహించిన పోటీల్లో పాల్గొని ఒకేసారి మూడు బంగారు పతకాలను కై వసం చేసుకుంది. స్నాచ్‌లో 69 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 90 కేజీలు..మొత్తంగా 159 కేజీల బరువును లేపి ట్రిపుల్ గోల్డ్ చాంపియన్‌గా నిలిచింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణికు రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోషియేషన్ అధ్యక్షురాలు నీలం శెట్టి లక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు బెల్లాన లక్ష్మి, కోచ్ చల్లా రాము, గ్రామస్తులు అభినందించారు.
ట్రిపుల్ గోల్డ్ చాంపియన్‌గా నిలిచిన భవాని