
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్‌డ్ స్కిన్‌లెస్ శ్రీ78 శ్రీ166 శ్రీ176
కానిస్టేబుల్ కుటుంబానికి ‘చేయూత’
విజయనగరం క్రైమ్ : జిల్లా పోలీసు శాఖలో ఆర్మ్‌డ్ రిజర్వు విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సత్తిబాబు కుటుంబానికి పోలీసు శాఖ చేయూత కింద రూ.1,47,300ల విలువైన చెక్‌ను ఎస్పీ వకుల్ జిందల్ శనివారం అందజేశారు. ఈ మేరకు తన చాంబర్‌లో సత్తిబాబు భార్య బి.రాజేశ్వరికి దీన్ని అందజేశారు. సిబ్బంది ఈ మొత్తాన్ని సేకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖలో పని చేస్తూ ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యంతో మృతి చెందిన సిబ్బంది కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఆఫీసు సూపరింటెండెంట్ టి.రామకృష్ణ, పోలీసు కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
మద్యం దుకాణంలో చోరీ
సంతకవిటి: మండల కేంద్రంలోని జీపీ వైన్స్‌లో మద్యం దుకాణంలో చోరీ జరిగింది. పోలీసులు, దుకాణ యాజమాన్యం తెలిపిన వివరాలు.. మద్యం దుకాణం వెనుకన ఉన్న గోడకు శుక్రవారం రాత్రి కన్నం చేసి దొంగలు లోపలికి ప్రవేశించారు. తొలిత సీసీ కెమెరాను తప్పించి హర్డ్ డిస్క్‌తో పాటు రూ.14వేల నగదు, రూ.24 వేల విలువ చేసే మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం దుకాణం తెరిచిన సిబ్బంది చోరీ జరిగినట్టు గుర్తించి యాజమాన్యంకు తెలిపారు. దీంతో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్‌ఐ వాసుదేవరావు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ తెలిపారు.
లారీ బోల్తా పడి ట్రాఫిక్ జామ్
బొబ్బిలి రూరల్: మండలంలోని పారాది గ్రామ సమీపంలో బొగ్గు లారీ శనివారం బోల్తా పడడంతో విశాఖ, రాయగడ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం 8 గంటల సమయంలో బొబ్బిలి నుంచి విశాఖ వైపు వెళుతున్న బొగ్గు లారీ అదుపుతప్పి పారాది గ్రామ సమీపంలో బోల్తా పడింది. అప్పుడే విశాఖ నుంచి వస్తున్న ఆయిల్ ట్యాంకర్ లారీ దానిని తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న బురదలో చిక్కుకు పోయింది. దీంతో విశాఖ, రాయగడ వైపు వెళ్లే రహదారిలో అటు రామభద్రపురం, ఇటు గ్రోత్ సెంటర్ వరకు దాదాపు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోగా రాకపోకలు ఆగిపోయాయి. విషయం తెలుసుకున్న సీఐ సతీష్‌కుమార్ తన సిబ్బందితో అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు యధావిధిగా రాకపోకలు కొనసాగాయి.
ఆటో బోల్తా పడి పలువురికి గాయాలు
గుమ్మలక్ష్మీపురం: ఒడిశా ప్రాంతం పిప్పలభద్ర ఘాట్ రోడ్డులో ఆటో బోల్తా పడిన ప్రమాదంలో మండలంలోని కొందుకుప్ప, మూలిగూడ గ్రామాలకు చెందిన పలువురు గాయాల పాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని రాయగడలో జరుగుతున్న రథయాత్రకు పై గ్రామాలకు చెందిన సుమారు 17 మంది ఆటోలో వెళ్తుండగా మార్గ మధ్యలోని పిప్పలభద్ర ఘాట్ రోడ్డు వద్ద ఆటో అదుపు తప్పి సైడ్ వాల్‌కు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కొందుకుప్పకు చెందిన పత్తిక సుమంతి, పత్తిక మన, జయంతితో పాటు మూలిగూడకు చెందిన పత్తిక శ్రీరాం, జీలకర్ర సరితలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా వైద్య నిమిత్తం క్షతగాత్రులను కురుపాం ఆసుపత్రికి తరలించారు.

చికెన్

చికెన్

చికెన్