
అన్ని కార్యాలయాల్లో పీజీఆర్‌ఎస్ : కలెక్టర్
పార్వతీపురం టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)ను అన్ని కార్యాలయాల్లో నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు స్వీకరించాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీఆర్‌ఎస్ వివరాలు 1100 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీదారులు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లోనూ అర్జీలు నమోదు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి, దానికి సంబంధించి సమాచారం తెలుసుకునేందుకు నేరుగా కాల్ చేయవచ్చని తెలిపారు.
నేడు పీజీఆర్‌ఎస్
సీతంపేట: సీతంపేట ఐటీడీఏలోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఐటీడీఏ అఽధికారులు నిర్వహించనున్నారు. గిరిజనులు తమ సమస్యలకు సంబంధించి అర్జీలు సమ ర్పించవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.
11న కలెక్టరేట్ వద్ద
విద్యార్థుల మహాధర్నా
విజయనగరం గంటస్తంభం: రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్‌మెంటు, స్కాలర్‌షిప్పుల బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 11న కలెక్టరేట్ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్టు ఏఐఎస్‌ఎఫ్ వెల్లడించింది. ఈ మేరకు నగరంలోని ఏఐఎస్‌ఎఫ్ కార్యాలయంలో దీనికి సంబంధించి కరపత్రాలను ఆదివారం ఆ సంఘ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఎన్.నాగభూషణం మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరు త్రైమాసికాల ఫీజు బకాయి లు రూ.4200 కోట్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విడుదల చేస్తామని యువగళం పాదయాత్రలో ప్రస్తుత విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ నేటికీ ఆ హామీ నెరవేరలేదన్నారు. అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారని ధ్వజమెత్తారు. అలాగే ఎన్నికల సమయంలో జీవో 77 రద్దు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారని అదీ నెరవేరలేదన్నారు. ఈ జీవో వల్ల పేద వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య తీరని కల గానే మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77ను తక్షణ మే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వీటి కోసం జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. 11న జరగనున్న కలెక్టరేట్ వద్ద మహాధర్నాకు విద్యార్థులు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఏస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యద ర్శి పి.గౌరీశంకర్, పట్టణ నాయకులు నవీన్, సా యి, రాము, రామకృష్ణ, ప్రవీణ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను
నిర్వీర్యం చేసే కుట్ర
విజయనగరం అర్బన్: ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే సంస్కరణలను మానుకోవాలని యూటీఎఫ్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. స్థానిక జిల్లా పరిషత్ మినిస్టీరియల్ సమావేశ మందిరంలో సంఘం జిల్లా కమిటీ ఆదివారం నిర్వహించిన సమావేశంలో పలువురు నేతలు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ప్రభుత్వ పాఠశాలలను బలపర్చే దిశగా కూట మి ప్రభుత్వ నిర్ణయాలు ఉండడం లేదని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని హెచ్చరించారు. నాణ్యమైన విద్యను అందించడంపై కాకుండా యోగా డే, మెగా పేరెంట్స్ మీటింగ్‌ల నిర్వహణలౖ పె దృష్టి పెట్టడం సరికాదన్నారు. పాఠశాల సమ యం మొత్తాన్ని బోధనకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మిగులు ఉపాధ్యాయులను క్లస్టర్ పాఠశాలలకే కేటాయించకుండా తిరిగే విధంగా నియమించడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం సమస్యగా మారుతోందని పేర్కొన్నారు. ఇటీవల బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో సుమారు 1500 మంది పొజిషన్ ఐడీలు లేక, క్యాడర్ స్ట్రెంత్ లేనందున జీతాలు పొందలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. వీరికి పొజిషన్ ఐడీలు కేటాయించి జీతాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 9న జాతీయ స్థాయి లో జరిగే సార్వత్రిక సమ్మెకు యూటీఎఫ్ పూర్తి మద్దతు ప్రకటించిందని, యూటీఎఫ్ సభ్యులు భాగస్వా మ్యం అవుతారని వెల్లడించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహన్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జేఏవీఆర్‌కే ఈశ్వరరావు, యూటీఎఫ్ సీనియర్ నాయకురాలు కె.విజయ గౌరి, రాష్ట్ర కమిటీ సభ్యులు జేఆర్‌పీ పట్నాయక్, రాష్ట్ర కార్యదర్శి పి.కస్తూరి, అకడమిక్ కమిటీ సభ్యుడు డి.రాము, కోశాధికారి సీహెచ్ భాస్కరరావు పాల్గొన్నారు.