
రైతులను తిప్పించుకోవద్దు..
● తహసీల్దార్‌కు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సూచన ● పార్టీ సమావేశంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన
మెరకముడిదాం: రైతులను మీ చుట్టూ తిప్పించుకోవద్దు, వారు పనులు మాని మీ చుట్టూ తిరగాలంటే కుదరదు కదా..మీరు వాళ్ల వ్యవసాయ బోర్లకు అవసరమైన సర్టిఫికెట్లను త్వరితగతిన అందజేయండి. అంటూ మెరకముడిదాం తహసీల్దారు అజూరఫీజాన్‌కు మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సూచించారు. ఆదివారం ఆయన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లతో కలిసి మండలంలోని చినబంటుపల్లి మిల్లు వద్ద మెరకముడిదాం మండలానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. సమావేశంలో ఆయన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఏవైనా సమస్యలున్నాయా? అని అడిగారు. దానికి మండలంలో చాలా మంది రైతులు వ్యవసాయ బోరు బావులకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్ కోసం అవసరమైన ఫారం–3 సర్టిఫికెట్లను జారీ చేయడంలో స్థానిక తహసీల్దారు అజూరఫీజాన్ నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. దీనికి స్పందించిన ఎమ్మెల్సీ బొత్స వెంటనే సర్టిఫికెట్లను జారీ చేయాలని తహసీల్దారు అజూరఫీజాన్‌కు ఫోన్ ద్వారా సూచించారు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పింఛన్ల మంజూరులో మార్పులు తీసుకురావడంతో చాలా మంది వితంతువులకు పింఛన్లు మంజూరు కావడం లేదని పలువురు నాయకులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఎస్.వి.రమణరాజు, తాడ్డి వేణుగోపాల్‌రావు, కోట్ల విశ్వేశ్వరరావు, కె.ఎస్.ఆర్.కె.ప్రసాద్, బూర్లె నరేష్‌కుమార్, పప్పల కృష్ణమూర్తి, సత్తారు జగన్‌మోహన్‌రావు, చీపురుపల్లి మండల నాయకులు ఇప్పిలి అనంతం, మీసాల వరహాలనాయుడు, గరివిడి మండల నాయకులు మీసాల విశ్వేశ్వరరావు, కడుముల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.