
ఉషు పోటీల్లో భామిని విద్యార్థుల సత్తా
భామిని: ఉషు పోటీల్లో భామిని విద్యార్థులు సత్తాచాటి మెడల్స్ సాధించి పలువురి మన్ననలు పొందారు. ఈ నెల 12,13 తేదీల్లో కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో భామిని విద్యార్థులు విజేతలుగా నిలిచారని క్రీడల కోచ్ కె.సోమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీతంపేట ఐటీడీఏ స్పోర్ట్స్ అధికారి ఎన్.జాకోబ్ దయానందం సహాయ సహకారాలతో పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ఉషు పోటీలలో జూనియర్ విభాగంలో ఎన్.కె.శాంతి, సీనియర్ విభాగంలో పి.దీపిక, కె.సోమేష్‌లు గోల్డ్ మెడల్స్, పి.నాగరాజు, పి.చరణ్‌లు సిల్వర్ మెడల్స్ సాధించారని కోచ్ తెలిపారు. ఈ మేరకు పసుకుడిలో విజేతలను మండల నాయకులు బి.రవినాయుడు, కిరణ్‌కుమార్‌లు అభినందించారు.