
కూటమి పాలనలో.. భద్రత కరువు
● తహసీల్దార్‌ను భయభ్రాంతులకు
గురిచేసేలా పార్వతీపురం
ఎమ్మెల్యే తీరు
● అర్ధరాత్రి సమయంలో వాట్సప్ కాల్ చేయడంలో ఆంతర్యం ఏమిటి?
● అధికారి తప్పుచేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి
● చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు అధికారిపై తప్పుడు ఆరోపణలు
● ఓ ఎమ్మెల్యేపై అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడం జిల్లా చరిత్రలో ప్రథమం
● దీనిపై విచారణ జరిపించాలి
● జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు
ఓ గ్రామంలో సమస్య వచ్చింది. నేను ఫోన్ చేశాను.. తహసీల్దార్ ఫోన్ తీయలేదంటూ స్వయానా ఎమ్మెల్యే విజయచంద్ర చెప్పారు. సమస్య వస్తే తహసీల్దార్ ఒక్కరే కాదు.. ఆపైన ఆర్డీఓ ఉంటారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఉంటారు. కలెక్టర్ ఉంటారు. ఎవ్వరికై నా ఫిర్యాదు చేయవచ్చు. అలా కాకుండా రాత్రి 10 గంటల సమయంలో ఫోన్ చేసి మహిళా అధికారిని దుర్భాషలాడి, భయభ్రాంతులకు గురి చేయడం ఎంత వరకు సమంజసం. ఓ మహిళా అధికారితో రాత్రి సమయంలో ఎలా మాట్లాడతారు. ఇదే విషయాన్ని తహసీలార్ద్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తను చెప్పలేని మాటలు మాట్లాడారంటూ అందులో పేర్కొన్నారు. వాస్తవానికి మొట్ట మొదటి నుంచి పార్వతీపురం ఎమ్మెల్యే పనితీరు వివాదాస్పందంగా ఉంది. అక్కడ ఎంపీడీఓలు సైతం పని చేసేందుకు భయపడుతున్నారు. సీతానగరం ఎంపీడీఓ సెలవుపై వెళ్లిపోయారు. ఆ నియోజకవర్గంలో అధికారులు పని చేయలేకపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి స్థానిక ఎమ్మెల్యేను నియంత్రించేలా చర్యలు చేపట్టాలి. తహసీల్దార్‌పై జరిగిన ఘటనలు పునారవృతం కాకుండా చూసుకోవాలి.
మొదటి
నుంచి
వివాదస్పదంగా ఎమ్మెల్యే తీరు..
విజయనగరం:
కూటమి ప్రభుత్వంలో అధికారులకు భద్రత కరువైందని ఉమ్మడి విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇసుక దోపిడీని అడ్డుకున్న మహిళా ఎమ్మార్వో వనజాక్షిని అప్పటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో దాడి చేయించగా... తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం తహసీల్దార్ వై.జయలక్ష్మిపై స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర భయభ్రాంతులకు గురిచేయడం వివాదస్పదంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలపై నియంత్రణ కరువైందని, కనీసం సీఎం, ఇన్‌చార్జి మంత్రులు, మంత్రులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పార్వతీపురం ఎమ్మెల్యేపై తహసీల్దార్ చేసిన ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పాలనలో కీలకమైన అధికారులను బెదిరించడం తగదన్నారు. ధర్మపురిలోని సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన మాటల్లోనే..
అర్ధరాత్రి సమయంలో వాట్సప్ కాల్
చేయడంలో ఆంతర్యం ఏంటి...
పార్వతీపురం తహసీల్దార్ జయలక్ష్మి పార్వతీపురం ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు శుక్రవారం మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాతో పాటు కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీనిని ఎమ్మెల్యే సైతం మీడియా సాక్షిగా ధ్రువీకరించారు. ఉమ్మడి విజయనగరం జిల్లా చరిత్రలో ఒక ఎమ్మెల్యేపై తహసీల్దార్ ఫిర్యాదు చేయడం ఇదే తొలిసారి. తహసీల్దార్‌తో వాట్సాప్ కాల్‌లో మాట్లాడని ఎమ్మెల్యే స్వయంగా చెప్పారు. ఒక మహిళా అధికారికి రాత్రి 10 గంటల సమయంలో ఫోన్ చేయడం, వాట్సాప్ కాల్ మాట్లాడడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే దూషించారని, భయంభ్రాంతులకు గురిచేశారంటూ ఆమె లిఖిత పూర్వకంగా చేసిన ఫిర్యాదుకాపీ బయటకు రావడంతో లేనిపోని ఆరోపణలు చేస్తూ ధర్నాలకు ఉసిగొల్పడం విడ్డూరంగా ఉంది. ఇలా అయితే అధికారులు పాలన సాగించడం కష్టం.
ఎమ్మెల్యే ఏమైనా డాక్టరా...?
పార్వతీపురం తహసీల్దార్ మానసిక స్థితి సరిగా లేదని ఎమ్మెల్యే వాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆమె మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు ఆయనేమైనా డాక్టరా అంటూ ప్రశ్నించారు. ఆమె పనితీరు బాగులేకుంటే ఉన్నతాధికారులే చర్యలు తీసుకుంటారు. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యలపై దృష్టి సారించాలే తప్ప అధికారులను ఇబ్బందులకు గురిచేసే అధికారం ఎవరిచ్చారు?. ఓ మండల మేజిస్ట్రేట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారిపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన తహసీల్దార్ ఫిర్యాదుపై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ జరిపించాలి. అధికారులకు భద్రత కల్పించాలి. సమస్యలుంటే డీఆర్సీ సమీక్షలో ప్రస్తావించి పరిష్కరిచుకోవాలే తప్ప లేనిపోని ఆరోపణలు తగవు.
అభివృద్ధి లేదు... అంతా అవినీతే...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి జరగకపోగా.. అవినీతి రాజ్యమేలుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలు అమలుచేయడంలేదు. అభివృద్ధి కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో జరగడంలేదు. కేవలం అవినీతి కార్యక్రమాలకే ప్రజాప్రతినిధులు మొగ్గు చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సమావేశంలో పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, జెడ్పీటీసీ సభ్యుడు వర్రి నరసింహమూర్తి, ఎంపీపీ ఉత్తరావల్లి సురేష్ ముఖర్జీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, ఎస్సీసెల్ కార్యదర్శి పీరుబండి జైహింద్‌కుమార్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంత్ తదితరులు పాల్గొన్నారు.
తప్పులు కప్పిపుచ్చుకునేందుకే...
జిల్లాలో మహిళా తహసీల్దార్‌పై అనుచిత ప్రవర్తన జరుగుతుంటే అదే జిల్లాలో ఉన్న మహిళా మంత్రి, విప్‌గా పనిచేస్తున్న మరో మహిళా ఎమ్మెల్యే స్పందించకపోవడం శోచనీయం. ములగ గ్రామానికి చెందిన రైతుల నుంచి తహసీల్దార్ రూ.10 లక్షలు డిమాండ్ చేశారని అందులో రూ.2 లక్షలు ఇచ్చినట్టు ఎమ్మెల్యే చెబుతున్నారు. ఈ విషయం రైతులు తన వద్ద చెప్పలేదంటున్నారు. తాను చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ఎమ్మెల్యే మహిళా తహసీల్దార్‌ను అవినీతి పరురాలిగా చిత్రీకరించడం, రాజకీయ రంగు పులమడం బాధాకరం. కొత్తగా పార్వతీపురం ఎమ్మెల్యేగా ఎన్నికై న విజయచంద్ర ఒక్క విషయాన్ని గుర్తించుకోవాలి. ప్రభుత్వాలు మారినప్పటికీ అధికారులు మారరన్న విషయాన్ని తెలుసుకోవాలి.