● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి
విజయనగరం లీగల్: శాశ్వత లోక్ అదాలత్‌ను ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటే ఇరుపార్టీలకు మేలు చేస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికల్యాణ్ చక్రవర్తి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఉత్తర్వుల మేరకు శుక్రవారం జిల్లా కోర్టు ఆవరణలో పాలీగల్ వలంటీర్స్‌కు, శాశ్వత లోక్ అదాలత్ ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్, విశ్రాంత జిల్లా న్యాయమూర్తి జి.దుర్గయ్య మాట్లాడుతూ శాశ్వత లోక్ అదాలత్‌లో వ్యాజ్యం వేయడం వల్ల ఎటువంటి కోర్టు ఫీజు ఉండదన్నారు. దీనిమీద తీర్పు చెప్పనున్నారని, ఇక్కడ తీర్పు చెప్పిన మీదట దానికి ఆపీల్ ఉండదని స్పష్టం చేశారు. హాజరైన పారా లీగల్ వలంటీర్స్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ వలంటీర్స్ అందరూ శాశ్వత లోక్ అదాలత్ గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి బీహెచ్‌వీ లక్ష్మీకుమారి, శాశ్వత లోక్ అదాలత్ సిబ్బంది, పారా లీగల్ వలంటీర్స్ పాల్గొన్నారు.