విద్యార్థుల భద్రత ముఖ్యం
పిడుగురాళ్ల: విద్యార్థుల భద్రత ముఖ్యమని, వారిని జాగ్రత్తగా తీసుకు వెళ్లాల్సిన బాధ్యత డ్రైవర్లు, క్లీనర్లపై ఉందని జిల్లా రవాణా శాఖ అధికారి సంజీవ్ కుమార్ అన్నారు. రోడ్డు భద్రతపై పిడుగురాళ్ల పట్టణంలోని పలు పాఠశాలలకు చెందిన బస్సు డ్రైవర్లకు రవాణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంజీవ్‌కుమా ర్ మాట్లాడుతూ... బస్సులు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల డ్రైవర్లకు అవగాహన కల్పించాలన్నారు. స్కూల్ విద్యార్థులను బస్సుల్లో ఎక్కించేటప్పుడు, దించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు నిలబడకుండా సీటులో కూర్చునే విధంగా చూడాల్సిన బాధ్యత కూడా బస్సు డ్రైవర్, క్లీనర్‌పై ఉంటుందన్నారు. అధికంగా విద్యార్థులను ఎక్కించుకోకుండా చూడాల్సిన బాధ్యత మనపైనే ఉంటుందన్నారు. విద్యార్థి జీవితం మనపైనే ఆధారపడి ఉంటుందని అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని డ్రైవింగ్ చేయాలని అన్నారు. ఫిట్‌నెస్ లేని బస్సులు ఏమైనా ఉంటే యాజమాన్యానికి తెలియజేసి, ఆ బస్సులను మార్చే విధంగా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో పిడుగురాళ్ల రవాణా శాఖ అధికారి రాంబాబు, జూనియర్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
జిల్లా రవాణా శాఖ అధికారి సంజీవ్‌కుమార్


