ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మృతి
పిడుగురాళ్ల: అర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఓ ప్రయాణికుడు శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. గుంటూరు నుంచి మాచర్ల వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సులో ప్రయాణిస్తున్న కాండ్రు శివప్రసాద్(69) పిడుగురాళ్ల పట్టణ సమీపానికి రాగానే ఒక్కసారిగా గుండెపోటుతో పడిపోయాడు. గమనించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ పిడుగురాళ్ల పట్టణంలోని కళ్లం టౌన్‌షిప్ సమీపంలో బస్సు ఆపి చూసే సరికి అప్పటికే పరిస్థితి విషమించటంతో అంబులెన్స్‌కు సమాచారం అందించి బంధువులు హుటాహుటిన పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అప్పటికే శివప్రసాద్ మృతి చెందినట్లు తెలిపారు. ఈ సంఘటనపై పిడుగురాళ్ల ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లును వివరణ కోరగా పిడుగురాళ్ల బస్సు కాదని, మాచర్ల డిపోకు చెందిన అద్దె బస్సు గుంటూరు నుంచి మాచర్ల వెళుతుండగా ఈ సంఘటన జరిగినట్లు సమాచారం తెలిసిందన్నారు.
జాతీయ స్విమ్మింగ్ పోటీలకు
ఎస్‌ఎస్ అండ్ ఎన్ విద్యార్థులు
నరసరావుపేట ఈస్ట్: జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ అండర్–19 స్విమ్మింగ్ పోటీలకు శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల విద్యార్థులు కె.శివసాకేత్, కె.రుద్రపతాప్ సైదులురెడ్డి ఎంపికై నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.ఎస్.సుధీర్, వ్యాయామ అధ్యాపకుడు డాక్టర్ యక్కల మధుసూదనరావు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విశాఖలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల స్విమ్మింగ్ పోటీలో శివసాకేత్ 200 మీటర్లు బటర్‌ఫ్‌లై, రుద్రప్రతాప్ 4‘‘100 మీటర్లు విభాగంలో ప్రతిభ చూపి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారని వివరించారు. ఢిల్లీలో ఈనెల 30 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు జరగనున్న 69వ అండర్–19 జాతీయ స్కూల్‌గేమ్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్–2025 పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులకు పాలకవర్గ అధ్యక్ష్య, కార్యదర్శులు కపలవాయి విజయకుమార్, నాగసరపు సుబ్బరాయగుప్త, జాయింట్ సెక్రటరీ ఊటుకూరి వెంకటఅప్పారావు, వైస్‌ప్రిన్సిపల్‌డాక్టర్ పి.శ్రీనివాససాయి అభినందించారు.
ఆటో ఢీకొని వృద్ధురాలి మృతి
రేపల్లె: ఆటో ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన మండలంలోని రుద్రవరం వద్ద చోటు చేసుకుంది. పట్టణ సీఐ మల్లికార్జునరావు వివరాల మేరకు.. తోమాటి సామ్రాజ్యం (80) రుద్రవరం వద్ద పండ్లు అమ్ముకుంటూ రహదారిపై వస్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో శుక్రవారం ఢీకొంది. దీంతో ఆమె కుప్పకూలిపోయింది. రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
జాతీయ ఫెన్సింగ్ పోటీలకు కార్తికేయ ఎంపిక
వేటపాలెం: అంతర్ జిల్లాల ఫెన్సిలింగ్ పోటీలకు పందిళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి మేకపోతుల యతిన్ శ్రీకార్తికేయ ఎంపికై నట్లు హెచ్‌ఎం దీప్తి శుక్రవారం తెలిపారు. కొనసీమ జిల్లాలో ఈ నెల 24, 25, 26 తేదీల్లో జరిగిన ఫాయిల్ వ్యక్తిగత విభాగంలో కార్తికేయ రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానం సాధించాడని పేర్కొన్నారు. మహారాష్ట్రలో డిసెంబర్‌లో జరగనున్న ఎస్‌జీఎఫ్ నేషనల్ ఫెన్సింగ్ టీం ఈవెంట్‌కు రాష్ట్రం తరఫున ఆడనున్నారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మృతి
ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మృతి
ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మృతి


