19, 20వ తేదీల్లో కళ్లం ఇంజినీరింగ్ కళాశాలలో ‘సంకల్ప్
గుంటూరు రూరల్: మండలంలోని చౌడవరంలో గల కళ్లం ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి విద్యార్థుల సాంకేతిక మేనేజ్‌మెంటు సదస్సు (సంకల్ప్ 2025) గోడ ప్రతులను గురువారం కళాశాల చైర్మన్ కళ్లం మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంకల్ప్ పేరుతో ఏటా విద్యార్థుల్లో నైపుణ్యతలను మెరుగు దిద్దేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంటామని తెలిపారు. కళాశాల డైరెక్టర్ ఎం. ఉమాశంకరరెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది డిసెంబర్ 19, 20వ తేదీల్లో సంకల్ప్ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో పెద్దఎత్తున రాష్ట్ర, జాతీయ స్థాయి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొంటారన్నారు. సాంకేతిక, మేనేజ్‌మెంటు విభాగాలలో ప్రతిభ పాటవాలను ప్రదర్శించడం ద్వారా పెద్దఎత్తున పారితోషికాలు కూడా అందుకుంటారని వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బి.ఎస్.బి. రెడ్డి, కళ్లం భరద్వాజ, సంకల్ప్ నిర్వహణ సంచాలకులు హనుమంత్‌ప్రసాద్, కళాశాల డీన్ ఉపాధి కల్పన విభాగం పీఎల్ మాధవరావు పాల్గొన్నారు.
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): డిసెంబరు 1 నుంచి 20వ తేదీ వరకు ఏపీఎస్‌ఆర్టీసీ ఏసీ బస్సుల్లో పదిశాతం రాయితీ కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.సామ్రాజ్యం గురువారం తెలిపారు. గుంటూరు – బీహెచ్‌ఈఎల్ ఇంద్ర బస్సు చార్జి గతంలో రూ. 870 ఉండగా, ఇప్పుడు రూ. 790కి తగ్గిందన్నారు. గుంటూరు – బీహెచ్‌ఈఎల్ అమరావతి బస్సుల చార్జీ గతంలో రూ. 970 ఉండగా, రూ. 880కు తగ్గించినట్లు వెల్లడించారు. గుంటూరు – బీహెచ్‌ఈఎల్ వయా మంగళగిరి మీదుగా వెళ్లే బస్సు చార్జీ రూ. 700 ఉండగా, డిసెంబరు 1 నుంచి రూ. 640 తగ్గిందన్నారు. తెనాలి – బీహెచ్‌ఈఎల్ ఇంద్ర బస్సు రూ. 710, తెనాలి – విశాఖపట్నం బస్సు చార్జీ రూ. 850కు తగ్గించినట్లు తెలిపారు.
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై కేసు నమోదైంది. కొత్తపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెహ్రూనగర్‌కు చెందిన ఓ బాలిక ఇంటర్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన రాకేష్ అనే యువకుడు బాలికను రెండు నెలల క్రితం మాయమాటలు చెప్పి బలవంతంగా ఎత్తుకెళ్లాడు. పలు ప్రాంతాలకు తీసుకెళ్లి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
19, 20వ తేదీల్లో కళ్లం ఇంజినీరింగ్ కళాశాలలో ‘సంకల్ప్


