
పథకాలను నిర్ణీత గడువులోగా పూర్తిచేయండి
నరసరావుపేట: కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని కేంద్ర జలశక్తి అధికారులు కర్లపు కిరణ్‌కుమార్, రేష్మపిళ్‌లై కోరారు. జిల్లాలో కేంద్ర జలశక్తి ద్వారా అమలౌతున్న పథకాల తీరుతెన్నులను పరిశీలించేందుకు వచ్చిన వారు సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. జలజీవన్‌మిషన్, నీటిలభ్యతస్థాయి, అమృత 2.0, కాంపా, చిన్ననీటిపారుదల పథకాలు, జిల్లా నీటియాజమాన్య సంస్థ ద్వారా చేపడుతున్న పథకాల పురోగతిని సమీక్షించారు. చేసిన పనుల తాలూకా ఫొటోలను ఆన్‌లైన్‌లో వెంటనే అప్‌లోడు చేయాలని కోరారు. ద్వామా పీడీ శంకర్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
కేంద్ర జలశక్తి అధికారులు కర్లపు కిరణ్‌కుమార్, రేష్మపిళ్‌లై