
వైఎస్సార్ సీపీ శ్రేణులతో ఆత్మీయ కలయిక
యడ్లపాడు: వంకాయలపాడు గ్రామపంచాయతీ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ మండల పార్టీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వడ్డేపల్లి నరసింహ(రావు)రాజు నేతృత్వంలో తొలిసారిగా పార్టీ శ్రేణులతో ఆత్మీయ కలయిక ఏర్పాటైంది. మాజీమంత్రి విడదల రజిని ఆదేశాల మేరకు సోమవారం సంగం గోపాలపురంలో ఏర్పాటైంది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు పలువురు ప్రసంగించారు. గ్రామాల్లో ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పార్టీ అండగా నిలవాలని సూచించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మద్దూరి కోటిరెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కందుల శ్రీకాంత్, చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు షేక్ దరియావలి, నాదెండ్ల మండల పార్టీ అధ్యక్షులు మంగు ఏడుకొండలు, రూరల్ మండలం అధ్యక్షులు దేవినేని శంకరరావు, యడ్లపాడు మండల ఎంపీపీ పిడతల ఝాన్సీ దయాసాగర్, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు వడ్డేపల్లి నరసింహ(రావు) జన్మదిన వేడుకల్ని పురస్కరించుకుని కేక్ కట్‌చేసి అందరూ శుభాకాంక్షలు తెలిపారు.