
ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌కు 20 అర్జీలు
నరసరావుపేట: ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఏకా మురళి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు ఆయన అధ్యక్షత వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారిచే 20 అర్జీలు స్వీకరించారు. సంబంధిత శాఖలకు ఆయా ఫిర్యాదులను అందజేసి సమస్యలను వెంటనే పరిష్కరించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు.
● సమస్య తెలియజేసేందుకు పట్టణంలోని బాబాపేట నుంచి ఓ దివ్యాంగురాలు రాగా ఆర్డీఓ ఆమె వద్దకు వచ్చి సమస్య తెలుసుకున్నారు. తాను 90శాతంకు పైగా దివ్యాంగతనంతో ఉన్నానని తనకు ప్రస్తుతం రూ.6వేలు మాత్రమే ఇస్తున్నారని, తనకు రూ.15వేలు పింఛన్ అమలుచేయాలని కోరారు. సమస్యను పరిశీలించాల్సిందిగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.రవి, డీఆర్‌డీఏ పీడీ ఝాన్సీరాణిని కోరారు. డీఆర్‌ఓ మాట్లాడుతూ జిల్లాలో వెనుకబడిన వర్గాలవారి సమస్యల కోసం ప్రత్యేకంగా చొరవ తీసుకోని ప్రతి నెల నాల్గవ శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.