
ఉద్యోగుల సస్పెన్షన్‌పై విచారణ
నాదెండ్ల: గణపవరం గ్రామీణ పశువైద్యశాల వైద్యాధికారి సాంబశివారెడ్డి, వెటర్నటీ లైవ్‌స్టాక్ సిబ్బంది పవన్‌కుమార్ ఇటీవల సస్పెండ్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ విషయమై పశు సంవర్థక శాఖ డైరెక్టర్ దామోదర్‌నాయుడు శనివారం విచారణ చేపట్టారు. ఈ నెల 19న 3.30 గంటల సమయంలో రాష్ట్ర పశుసంవర్థకశాఖ, పాడి పరిశ్రమల స్పెషల్ చీఫ్ సెక్రటరీ సి రాజశేఖర్ గణపవరం పశువైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సమయంలో వైద్యాధికారి సాంబశివారెడ్డి, సిబ్బంది పవన్‌కుమార్ లేకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్ చేశారు. ఈ విషయమై శనివారం డైరెక్టర్ దామోదర్‌నాయుడు రికార్డులు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. స్థానిక పశుపోషకులను విచారించారు. వైద్యాధికారి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ఏ సమస్య వచ్చినా స్థానికంగా ఇళ్లకు వచ్చి వైద్యసేవలు అందిస్తున్నారని వివరించారు.
ఆలయ నిర్మాణానికి విరాళం
నరసరావుపేటరూరల్: ఇస్సపాలెంలోని మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణ పనులకు మేదరమెట్ల అంజమ్మ, మస్తాన్‌రావు విద్యాసంస్థల చైర్మన్ ఎంవీ శేషగిరిరావు, అనంతలక్ష్మీ దంపతులు విరాళంగా రూ.3 లక్షలు అందజేశారు. ఆలయ కార్యాయంలో ఈవో నలబోతు మాధవిదేవిని కలిసి విరాళం చెక్‌ను దాతలు అందించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు నండూరి కాళీకృష్ణ పాల్గొన్నారు.
వెబ్‌సైట్‌లో మెరిట్ కార్డులు
నరసరావుపేట ఈస్ట్: జాతీయ ఉపకార వేతన పరీక్షలో ఎంపికై న 168 మంది విద్యార్థుల మెరిట్ కార్డులు ప్రభుత్వ పరీక్షల కార్యాలయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్టు పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్థులు ఉపకార వేతనం పొందేందుకు వెంటనే బ్యాంక్ ఖాతా తెరిచి తమ ఆధార్‌ను లింక్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ప్రభుత్వ పరీక్షల వెబ్‌సైట్ www. bre.ap.gov.in ద్వారా తమ మెరిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకొని అన్ని వివరాలను ఒక్క అక్షరం తేడా లేకుండా సరిచూసుకోవాలని తెలిపారు. అనంతరం కేంద్ర మంత్రిత్వశాఖ స్కాలర్‌షిప్ పోర్టల్ www.rchoarrhipr .gov.in నమోదు చేసుకొని దరఖాస్తును అప్‌లోడ్ చేయాలని తెలిపారు. సంబంధిత పాఠశాల నోడల్ ఆఫీసర్, జిల్లా నోడల్ ఆఫీసర్ ద్వారా ధృవపరుచుకోవాలన్నారు. మెరిట్ కార్డులను త్వరలో డిప్యూటీ డీఈఓ కార్యాలయాల ద్వారా పాఠశాలలకు పంపిస్తామని తెలిపారు. కార్డులోని వివరాలను సరిచూసుకొని ఏవైనా పొరపాట్లు ఉన్నట్లయితే ప్రధానోపాధ్యాయుల ద్వారా డీఈఓ కార్యాలయంలో అందచేయాలని వివరించారు.
పవర్ లిఫ్టింగ్ పోటీల్లో షబీనా ప్రతిభ
మంగళగిరి టౌన్ : జాతీయ స్థాయిలో ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రం దావన్‌గిరిలో జరుగుతున్న జూనియర్ నేషనల్ ఎక్యూప్ట్ ఉమెన్ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారిణి ప్రతిభ చాటినట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు విజయభాస్కరరావు, షేక్ సందాని శనివారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తరఫున గుంటూరు జిల్లా తెనాలికి చెందిన షేక్ షబీనా 84 కిలోల విభాగంలో పాల్గొని కాంస్య పతకం సాధించినట్లు తెలిపారు. స్క్వాట్ 202.5 కిలోలు, బెంచ్ ప్రెస్ 97.5 కిలోలు, డెడ్ లిఫ్ట్ 182.5 కిలోలు, ఓవరాల్ 482.5 కిలోల విభాగాల్లో కాంస్య పతకాలు సాధించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 514.20 అడుగుల వద్ద ఉంది. ఇది 138.9118 టీఎంసీలకు సమానం.

ఉద్యోగుల సస్పెన్షన్‌పై విచారణ

ఉద్యోగుల సస్పెన్షన్‌పై విచారణ