
నేరుగా విక్రయించే అవకాశం
నాతో పాటు పలువురు రైతులు పండించిన కూరగాయలు, ఆకుకూరలను విక్రయించడానికి గురజాల నియోజకవర్గంలో రైతు బజార్ అందుబాటులో లేదు. దీంతో దళారులు చెప్పిన ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. మార్కెట్‌లో అధిక ధరలు ఉన్నప్పటికీ వ్యాపారులు మాత్రం మా నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. దీంతో కష్టపడి పండించిన మాకు ఏమాత్రం లాభం ఉండటం లేదు. రైతు బజార్లు ఉంటే నేరుగా వినియోగదారులకు విక్రయించే వీలుంటుంది.
– గురువారెడ్డి, గురజాల నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ రైతు విభాగ అధ్యక్షుడు