
ఆభరణాల కోసం వియ్యపురాళ్లు హత్య
పట్టణ శివారులో ఈనెల 19న జరిగిన జంట హత్యల కేసులో ప్రైవేటు బీమా కంపెనీ ఏజెంటు కుసుమకుమారిని ఏ–1 ముద్దా యిగా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఒంటరిగా ఉంటున్న వియ్యపురాళ్లు దాసరి రాజేశ్వరి (65), పిట్టా అంజమ్మ (70)ను పట్టపగలు 11.30 గంటల ప్రాంతంలో వారు నివాసముంటున్న ఇంటి కిందిభాగంలోనే హత్యకు గురయ్యారు. వారి ఒంటిపై బంగారు ఆభరణాలు అదృశ్యమయ్యాయి. సీసీ కెమెరా నిందితులను పట్టిచ్చింది. ఈ కేసులో కుసుమకుమారితోపాటు ఇద్దరు యువకులను పోలీసులను అరెస్టు చేశారు. ఇద్దరిలో ఒకరు ఆటో డ్రైవర్ కాగా, మరొకడు మైనర్ కావడం గమనార్హం. మారీసుపేట రెండుగేట్ల మధ్య ఒక ఇంటిలో వీరు ప్రణాళిక రచించుకోవడం, రెక్కీలు నిర్వహించడం, ఆ ప్రకారం నేరాలకు పాల్పడుతూ వచ్చినట్టు పోలీసు విచారణలో వెల్లడైంది.

ఆభరణాల కోసం వియ్యపురాళ్లు హత్య